VIDEO: గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత
AKP: బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఏజెన్సీ వద్దకు చేరడంతో తోపులాట చోటుచేసుకుంది. సరిపడా సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో నిర్వాహకులు పంపిణీలో కష్టాలు పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, చివరికి క్రమబద్ధంగా గ్యాస్ పంపిణీ చేశారు.