ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

NLG: దేవరకొండ మండలం పెంచికలపహాడ్‌లోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో తాత్కాలిక పద్ధతిలో గంటల ప్రాదిపాదికన(హవర్స్ బేస్డ్) ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ ఆశీర్వాదం తెలిపారు. పీజీటీ మ్యాథ్స్-1,పీజీటీ జువాలజీ-1,టీజీటీ ఇంగ్లీష్-1 సబ్జెక్టులు బోధించేందుకు తగిన అర్హత గల వారు ఈనెల 29న పాఠశాలలో నిర్వహించే డెమో క్లాసులకు హాజరు కావాలని సూచించారు.