పార్ట్‌టైం ఉద్యోగాలపై అప్రమత్తం కావాలి : సీఐ

అన్నమయ్య: పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే కోడూరు పట్టణ సీఐ హేమ సుందర్ రావు హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చుని లక్షల్లో సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మవద్దని, సోషల్ మీడియా, వాట్సప్, మెసేజ్‌లలో వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.