VIDEO: పనులు నిలిచిపోవడంతో గ్రామస్తుల ఇబ్బందులు

VIDEO: పనులు నిలిచిపోవడంతో గ్రామస్తుల ఇబ్బందులు

NLG: నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సర్వీస్ రోడ్డు పనులు నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీసు రోడ్డు ప్రక్కన డ్రైనేజీ పనులు కూడా ఆగిపోవడంతో ఇళ్లలోకి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.