కమలాపురంలో వార్డు కౌన్సిలర్ మృతి
కడప: కమలాపురం మున్సిపల్ 15వ వార్డు YCP కౌన్సిలర్ C.సంధ్యారాణి(51) సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకుని పుష్పాంజలి ఘటించారు. కాగా ఈమె భర్త C.గంగాధర్ రెడ్డి కమలాపురం పట్టణ YCP అధ్యక్షులుగా ఉన్నారు.