నేడు జిల్లాలో జాబ్ మేళా
KMM: జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం శనివారం ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. మారుతి ఆగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీలోని మార్కెటింగ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు SSC లేదా డిగ్రీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.