బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
MDK: రామాయంపేట మండల పరిధిలోని జమ్లా తండాలో ఇటీవల అగ్నిప్రమాదానికి గురై ఇల్లు కోల్పోయిన రజిత, దేవిసింగ్ కుటుంబాన్ని స్థానిక సర్పంచ్‌లు ఇవాళ పరామర్శించారు. జమ్లా తండా సర్పంచ్ బన్సి రాథోడ్, దంతెపల్లి సర్పంచ్ మస్కూరి బాలరాజు బాధిత కుటుంబానికి రూ. 5,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యాన్ని తక్షణ సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.