పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
MDK: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ అపార కృషిని స్మరించుకుంటూ రాజ్యాంగ పీఠికను సిబ్బందితో కలసి పఠనం చేశారు.