'గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయండి'

NDL: పాములపాడు మండలం మద్దూరు గ్రామ శివారులో వెలుగోడు వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారిందని గురువారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని పనులతో రోడ్డు దెబ్బతిని తరచూ ప్రమాదాలు సంభవించే స్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు స్పందించి రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేశారు.