పాముకాటుకు గురైన ఐదేళ్ల బాలుడు
E.G: గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఆడుకుంటుండగా కోటిరెడ్డి సాత్విక్(5)అనే బాలుడుని పాముకాటేసింది. దీంతో వెంటనే ఆ బాలుడిని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రం వద్ద పాముల సంచారం ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.