ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
WNP: జిల్లాలో మొంథా తుఫాన్ దృష్ట్యా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. రైతులు తమ పశువులను, వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని,పిల్లలు, వృద్ధులు నీటి ముంపు ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.