VIDEO: ‘CMను కలవడం నా చివరి కోరిక'
ప్రకాశం: తనకు CM చంద్రబాబును కలిసే అవకాశం కల్పించాలని TDP వీరాభిమాని హుస్సేన్ పీరా విజ్ఞప్తి చేశారు. ఇతను CMను కలిసేందుకు ఇప్పటివరకు 500 పోస్టు కార్డులను సీఎంకు పోస్ట్ చేశారు. అయినా ప్రయోజనం లేదు. కంభం అర్బన్ కాలనీకి చెందిన హుస్సేన్ గత 15ఏళ్లుగా TDP గుర్తులు, బొమ్మలను స్వయంగా తయారు చేస్తున్నారు. తనకు 88ఏళ్లు నిండాయని చివరిసారిగా CMను కలవటం తన చివరి కోరిక అన్నారు.