జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

కాకినాడ జిల్లాలో బుధవారం పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ రూరల్, తుని తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని హెచ్చరికల్లో పేర్కొంది.