'వరి కొయ్యలను కాల్చరాదు.. భూమిలో కలియ దున్నాలి'
SRD: ఖరీఫ్ పంట పొలంలో వరి కొయ్యలను కాల్చరాదని, ట్రాక్టర్‌తో కలియ దున్నాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం కంగ్టి మండలంలోని ఆయా రైతు కేంద్రాల్లో రైతు నేస్తం కార్యక్రమం జరిగింది. తడ్కల్ రైతు వేదికలో జరిగిన VCలో ఖేడ్ ADA నూతన కుమార్, AO హరి సింగ్ హాజరయ్యారు. సైంటిస్టులు తెలిపిన అంశాలపై స్థానిక రైతులకు అధికారులు, సలహాలు, సూచనలు ఇచ్చారు.