అందెశ్రీ పాటలు చిరస్థాయిలో నిలిచిపోతాయి: ఎంపీ
NZB: తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అందెశ్రీ పాటలు రాష్ట్ర ప్రజల మదిలో చిరస్థాయిలో నిలిచిపోతాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అందెశ్రీ అకాల మరణం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.