అశ్వవాహనంపై చెన్నకేశవ స్వామి వారు

TPT: గూడూరు పట్టణంలోని కర్ణాలవీధి నందు శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారిని అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు.మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆలయ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.