నేటి నుంచి జనగణన రెండో విడత శిక్షణ
KRNL: నగరంలో జనగణన కార్యక్రమానికి సంబంధించి ఎంపికైన ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్‌వైజర్లకు మంగళవారం నుంచి రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్కూల్, దామోదరం సంజీవయ్య మెమోరియల్ స్కూల్, ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ స్కూల్‌లలో శిక్షణ ఉంటుందన్నారు.