'చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలి'
AKP: గ్రామాల్లో సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి సేంద్రియ ఎరువుగా మార్చాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం తంగేడు గ్రామంలో పారిశుధ్యం పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మురికి కాలువలను శుభ్రం చేయించారు. మంచినీటి ట్యాంకులను పరిశీలించి క్లోరినేషన్ చేయించారు. అంటు వ్యాధులు వ్యాప్తి చందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.