వేదగిరి బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆనంకు ఆహ్వానం

వేదగిరి బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆనంకు ఆహ్వానం

NLR: నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల ఆరవ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వేదగిరి ఆహ్వాన పత్రికను అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలన్నారు.