VIDEO: రాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చిన కట్టాలమ్మ
TPT: దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీ కట్టాలమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామ దేవత శ్రీ కట్టాలమ్మ అమ్మవారు గురువారం భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఉదయం నుండి అభిషేకాలు అర్చనలు అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.