ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం: TPUS

ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం: TPUS

KMR: ఉపాధ్యాయ సమస్యలపై తపస్ నిరంతర పోరాటం చేస్తోందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీరేంద్రనాథ్ అన్నారు. శనివారం కామారెడ్డిలో డివిజన్‌లోని పలు మండలాల నూతన అధ్యక్ష కార్యదర్శులను నియమించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పెన్షన్ విధానంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.