జూదం ఆడుతున్న ముగ్గురు అరెస్ట్: ఎస్సై

KDP: పోరుమామిళ్ల చెరువు వద్ద కంపచెట్లలో జూదం ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోరుమామిళ్ల ఎస్సై కొండారెడ్డి తెలిపారు. కంపచెట్లల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. ఐదుగురిలో ఇద్దరు పరారీ కావడంతో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.12,200 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.