వర్క్‌ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం..!

వర్క్‌ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం..!

వలసదారులకు అందించే వర్క్ పర్మిట్‌ల ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని అమెరికా రద్దు చేసింది. దీంతో గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నా.. వలసదారులు తమ ఉద్యోగాలను కొనసాగించడానికి గతంలో లభించే 540 రోజుల పొడిగింపు ఇకపై లభించదు. అంతేకాకుండా, శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్‌ల గడువును ఐదేళ్ల నుంచి 18 నెలలకు కుదించారు.