విస్తృత తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపద్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. మెదక్ మండలం మంబోజిపల్లి టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పని తీరును, ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ, పకడ్బందీగా సోదాలు జరపాలన్నారు.