కుంభమేళాకు వెళ్తుండగా యాక్సిడెంట్

MDK: నార్సింగిలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముందు వెళ్తున్న లారీని టెంపో ట్రావెలర్ ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులతోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు.