APRJC ఫలితాల్లో పాందువ్వ యువకుడు స్టేట్ ఫస్ట్
WG: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన APRJC ఫలితాల్లో పాందువ్వ యువకుడు బొడ్డుపల్లి మనోజ్ కుమార్ బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. 136/150 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. తండ్రి సత్యనారాయణ ఏఆర్ పోలీసు గాను, తల్లి టీచర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ కావాలనే తమ కొడుకు కోరిక తీరుతుందని ఆకాంక్షించారు.