ఆ రెండు మృతదేహాలు కడప రిమ్స్ కు తరలింపు
KDP: వల్లూరు మండలం పుష్పగిరిలో పెన్నా నదిలో గల్లంతైన శ్రీనాథ్, సాయి చైతన్య అనే ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఆదివారం నీటిలో దిగిన వీరు సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో SI శివనాగిరెడ్డి, ఫైర్ సిబ్బంది డ్రోన్ల సాయంతో మృతదేహాలను వెలికితీసి కడప రిమ్స్‌కు తరలించారు. కొడుకుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.