అర్జీలు స్వీకరించిన జేసీ అభిషేక్ కుమార్

అర్జీలు స్వీకరించిన జేసీ అభిషేక్ కుమార్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 200 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో సువర్ణతో పాటు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు.