బోధకులు కాదు.. భాగస్వాములు కావాలి: జైశంకర్

కేంద్రమంత్రి జైశంకర్ యూరప్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. భారత్‌తో యూరప్ సన్నిహిత సంబంధాలు నెలకొల్పాలంటే స్నేహభావం, పరస్పర ఆసక్తి కలిగి ఉండాలన్నారు. న్యూ ఢిల్లీ ప్రపంచ దేశాల వైపు చూసినప్పుడు బోధకుల కోసం కాకుండా భాగస్వాముల కోసం ఎదురు చూస్తోందని వెల్లడించారు. బోధకులు చెప్పే విషయాలను తమ సొంతం దేశంలో పాటించరని తెలిపారు.