'బేతంచెర్లలో లేఔట్లు క్రమబద్ధీకరించుకోండి'

NDL: బేతంచెర్ల పట్టణంలో అనధికారికంగా ఉన్న లేఔట్లను క్రమబద్ధీకరించుకోవాలని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లేఅవుట్ యజమానులు, ప్లాటు కొనుగోలుదారులు వినియోగించుకోవాలన్నారు. క్రమబద్ధీకరణ చేయని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.