దుమ్ముతో ప్రయాణికుల ఇక్కట్లు

JGL: వెల్గటూర్ మండలం రాజక్కకల్లె శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ఇరువైపుల అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో ప్రయాణికులు దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ.. నిత్యం దుమ్మూధూళితో ప్రయాణంలో ఇబ్బంది కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.