కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టివేత.. నలుగురు అరెస్ట్

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టివేత.. నలుగురు అరెస్ట్

TG: హైదరాబాద్ లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌లో అధికారులు సోదాలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.