రేణిగుంట గురుకులం ఆకస్మిక తనిఖీ

రేణిగుంట గురుకులం ఆకస్మిక తనిఖీ

TPT: రేణిగుంట గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ గదులు, భోజన నాణ్యత, పరిశుభ్రత, విద్యా నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భోజన నాణ్యత మెరుగుపర్చాలని, హాస్టల్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.