16,000 అడుగుల ఎత్తులో మోనో రైలు
అరుణాచల్ ప్రదేశ్‌లోని కామెంగ్ హిమాలయాల్లో 16,000 అడుగుల ఎత్తులో భారత సైన్యం స్వదేశీ హై-ఆల్టిట్యూడ్ మోనో రైలు వ్యవస్థను మోహరించింది. ఈ ప్రాంతంలో తీవ్ర మంచు కారణంగా తరచూ సరఫరా మార్గాలు తెగిపోతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించి, సరిహద్దు పోస్టులకు నిరంతరాయంగా సరఫరా అందించడానికి దీనిని రూపొందించారు. ఈ మోనో రైలు ఒకేసారి 300 కిలోల కంటే ఎక్కువ బరువును రవాణా చేయగలదు.