VIDEO: భారీ వర్షం.. సంతోషంలో అన్నదాతలు

WGL: వర్ధన్నపేట మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. రామవరం, దివిటీపల్లి, దమ్మన్నపేట, కొత్తపల్లి, ఇల్లంద, తదితర గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండగా, వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వాన పడింది. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో దిగులు చెందిన రైతులు, నేటి వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.