విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

ELR: నూజివీడు మండలం మద్దాయికుంటలో మోడల్ ప్రైమరీ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. హెచ్ఎం తొమ్మండ్రు యువరాజు మాట్లాడుతూ.. ఎంపీటీసీ కళావతి ఆర్థిక సాయంతో విద్యార్థులకు 300 నోటు పుస్తకాలు, 100 పెన్నులు, 20 పలకలు బహుకరించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు పిలుపుతో పీ-4లో భాగంగా పాఠశాల అభివృద్ధికై ఎంపీటీసీ కృషి అభినందనీయమన్నారు.