సాత్వికతో కలిసి టిఫిన్ చేసిన హరీశ్ రావు

SDPT: ఈనెల 19న జరిగిన 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి' అనే విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో సాత్విక ఆవేదన విని వేదికపై ఎమ్మెల్యే హరీశ్ రావు కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇవాళ సాత్విక, ఆమె తల్లి విజయను టిఫిన్ చెసేందుకు ఆహ్వానించారు. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు టిఫిన్ చేశారు.