క్యూ ఆర్ కోడ్‌తో 'పది' హాల్ టికెట్స్
కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్స్ పై క్యూఆర్ కోడ్ పొందుపరిచింది. దీంతో దానిని స్కాన్ చేసి విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం చిరునామా, చేరుకోవడానికి పట్టే సమయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. కాగా.. ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.