జలదిగ్బంధంగా మారిన కొత్త కాలనీ

కోనసీమ: గొల్లప్రోలు శివారులోని కొత్త కాలనీకి గురువారం భారీగా వరద నీరు చేరింది. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై నాలుగు అడుగులకు పైగా నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు, కొండ కాలువ, శుద్దగడ్డ వాగులు పొంగిపొర్లాయి. ప్రాంతాలన్నీ జలమయంగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.