దిత్వా తుపాను ఎఫెక్ట్ .. పోలీసుల అప్రమత్తం
GNTR: దిత్వా తుపాను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసుల పరిపాలన కట్టుదిట్టం చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారికి తక్షణ సహాయం అందించేందుకు ప్రతి పోలీస్ సబ్‌డివిజన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.