‘పురపాలిక పన్నుల చెల్లింపు తప్పనిసరి’
WNP: పట్టణ అభివృద్ధికి ఆస్తి పన్ను చెల్లింపు కీలకమని పుర కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం అధికారులు ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేశారు. రెండేళ్లుగా బకాయి ఉన్నవారు చెల్లించేందుకు ఈ రెండు రోజులే ఆఖరి అవకాశమని, గృహ, వ్యాపార యజమానులు సహకరించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.