రేపటి నుంచి ఒంటిపూట బడులు

రేపటి నుంచి ఒంటిపూట బడులు

NDL: గడివేముల మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు MEO సుబ్బరామి రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు నడుస్తాయని పేర్కొన్నారు.