జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే

అనకాపల్లి: ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా మున్సిపల్ హైస్కూల్లో ఇవాళ జాబ్ మేళాను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఆసరాగా ఉండేందుకు జాబ్ మేళా దోహదపడుతుందన్నారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.