VIDEO: రాస్తారోకో నిర్వహించిన ఆశా వర్కర్లు
MLG: ఏటూరు నాగారం మండల కేంద్రాల్లోని జాతీయ రహదారులపై ఇవాళ CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.