'చెత్త కుప్పలు తొలగించండి'
ELR: నూజివీడు పట్టణ పరిధిలోని శ్రీ దత్తాశ్రమం ఎదురుగా రావిచర్ల గ్రామం వైపు వెళ్లే రహదారి వెంట చెత్త కుప్పలు పేరుకుపోవడం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తోందని వాహన చోదకులు వాపోతున్నారు. నిత్యం ఇటుగా వందలాది వాహనాలు సంచరిస్తుంటాయి. చెత్తకుప్పలలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు, క్యారీ బ్యాగులు ఎగిరి పడడం వలన అనేక ప్రమాదాలు సంభవించాయని వాహన చోదకులు వాపోతున్నారు.