'సారా రహిత మండలంగా తీర్చిదిద్దాలి'

VZM: నెల్లిమర్ల మండలాన్ని పూర్తిస్థాయి సారా రహిత మండలంగా తీర్చిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎంపీపీ నవోదయం 2.0 కమిటీ చైర్‌పర్సన్ అంబల్ల సుధారాణి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నవోదయం 2.0 కమిటీ సమావేశం ఎంపీపీ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మండలంలో సారా తయారీ, వినియోగం ఎక్కడా జరగకుండా చూడాలన్నారు.