'ఆహ్లాదకరంగా మారిన కీసరగుట్ట పరిసరాలు'

మేడ్చల్: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడడంతో కీసరగుట్ట పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. ORR సమీపంలో ఉండటంతో పర్యటకుల సైతం తరలివచ్చి కీసరగుట్టపై నుంచి పరిసరాల అందాలను చూసి మైమరచిపోతున్నారు. ఓవైపు స్వామి వారిని దర్శనం చేసుకుని, ప్రకృతితో గడుపుతున్నారు. చుట్టూరా ఉన్న పచ్చిక బయళ్లు, రాతి నిర్మాణాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.