తాడేపల్లిగూడెంలో వైసీపీకి భారీ షాక్

W.G: తాడేపల్లిగూడెంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డు సాయిబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి కొవ్విరి నాగేంద్ర రెడ్డి జనసేన పార్టీలో చేరారు. వారితోపాటు సుమారు 500 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఎమ్మెల్యే వారందరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.