VIDEO: కంభంలో పెరిగిన చలి తీవ్రత
ప్రకాశం: కంభం పట్టణంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం పూట చలి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పొగమంచు కమ్ముకొని ఉండటంతో పట్టణంలో జనసంచారం గణనీయంగా తగ్గింది. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.