చింతపల్లి మండలంలో 47 ఖాళీలు
ASR: చింతపల్లి మండలంలో 47అంగన్వాడీ ఆయా పోస్టులకు, అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సీడీపీవో సీహెచ్ శ్రీదేవి బుధవారం తెలిపారు. పీఎం జన్ మన్ ఆయాలు 2, రెగ్యులర్ అంగన్వాడీ ఆయాలు 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక గిరిజన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15వ తేదీలోగా ధరఖాస్తులు అందించాలన్నారు.